సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బాడీ డబుల్స్ ట్రెండ్ నడుస్తున్నది. స్టార్ హీరోలందరికీ ఓ బాడీ డబుల్ ఉండాల్సిందే. దర్శకులు సగం సినిమాను ఈ ‘డబుల్స్’తోనే కానిచ్చేస్తున్నారు. హీరోలు కూడా ‘మాకు బాడీ డబుల్ ఉంటే తప్పేంటి?’ అన్నట్టుగానే ఉంటున్నారు. అయితే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ చేస్తున్న ‘SSMB29’లో బాడీ డబుల్ ప్రస్తావనే ఉండకూడదని హుకుం జారీ చేశారట రాజమౌళి. కథ రీత్యా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ.
ఆ సన్నివేశాల్లో ఏ కోణం నుంచి చూసినా మహేష్ మాత్రమే కనిపించాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారట. హీరో కోసం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటూ, ఆయా సన్నివేశాలను జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే, బాడీ డబుల్‌తో అవసరం ఉండదనే అభిప్రాయానికి రాజమౌళి వచ్చారని తెలుస్తున్నది. ఇందుకోసం మహేశ్‌ని కూడా ఆయన ఒప్పించారట.
అభిమానులు మరింత థ్రిల్ ఫీలయ్యేలా రాజమౌళి నిర్ణయం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ని ఈ సినిమా పూర్తి చేసుకుంది. త్వరలో మూడో షెడ్యూల్‌ని టాంజానియాలో కానీ, దక్షిణాఫ్రికాలోగానీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనుండగా, మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక పానిండియా సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.