మహేష్ బాబు నటిస్తున్న 28వ సినిమా శ్రీకారం చుట్టుకుంది. సోమవారం హైదరాబాద్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నది. సినిమా సెట్లోని ఫొటోను నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆయన స్పందిస్తూ…‘12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్స్ మీదకు వచ్చింది.
ఇవాళ్టి నుంచి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్ర షూటింగ్ ప్రారంభించాం. మాస్ లుక్లో మహేష్ బాబు ఆకట్టుకుంటారు. ఆశ్చర్యపరిచే మరికొన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడిస్తాం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబీ28 ఆరంభం అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. మహేష్ బాబు కొత్త లుక్ను ఆయన సతీమణి నమ్రత ఇన్స్టా ద్వారా షేర్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల కానుంది.