Mahesh Babu| సినిమాలో నటించాలనే ఆసక్తి, కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే వచ్చిన అవకాశాలని కొందరు సద్వినియోగం చేసుకుంటారు. మరి కొందరికి అదృష్టం కలిసి రాక సైడ్ అయిపోతూ ఉంటారు. హీరోయిన్స్ విషయానికి వస్తే మంచి ఫేమ్ అందుకున్నాక ఉన్నన్ని రోజులు భారీగా సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక పెళ్లి తర్వాత ఎలాగు ఆఫర్స్ రావు కాబట్టి సైడ్ అయిపోతూ ఉంటారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఓ భామకి సక్సెస్ దక్కక చివరికి సీరియల్స్‌లో కూడా నటించింది. అయిన కూడా పెద్దగా సక్సెస్ కాలేక వేరే రంగంలో తన సత్తా చూపించింది.
మయూరి కాంగో.. ఈ పేరు చెచితే ఎవరు పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు.. కానీ మహేష్ నటించిన వంశీ సినిమా అంటే ఆమె రూపం కాస్త గుర్తుకు రావచ్చు. చిత్రంలో మహేష్ బాబు స్నేహితురాలిగా, ఓ మోడల్ పాత్రలో కనిపిస్తుంది. ఈ అమ్మడు ముందుగా బాలీవుడ్ లో తన సినిమా కెరీర్ ను ప్రారంభించింది. 1995లో నసీమ్ అనే హిందీ సినిమాలో తొలిసారి కనిపించింది. ఆ తర్వాత పాపా కెహెతే హై, బేటాబీ, హోగీ ప్యార్ కీ జీత్, మేరే అప్నే, బాదల్, పాపా ది గ్రేట్, జంగ్, శికారీ వంటి సినిమాలలో నటించి అలరించింది. అయితే ఆమె కెరీర్ సాఫీగానే సాగింది. సినిమాలు కూడా కొన్ని హిట్ అయ్యాయి. తర్వాత ఏమైందో ఏమో వరుస ఫ్లాపులు పలకరించాయి.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో వంశీ సినిమా చేసిన విజయం దక్కలేదు. దాంతో చివరికి సీరియల్స్ చేసింది. అక్కడ కూడా అదృష్టం దక్కకపోవడంతో చేసేదేమి లేక సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది మయూరి. ఇక 2003లో ఎన్ఆర్ఐ ఆదిత్య థిల్లాన్ను మ్యారేజ్ చేసుకొని న్యూయార్క్ వెళ్లి అక్కడే సెటిలైపోయింది. అక్కడి ప్రముఖ కాలేజ్ బరూచ్ కాలేజ్ జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తి చేయగా, తన ప్రతిభతో ప్రముఖ గ్లోబల్ మీడియా ఏజెన్సీ పెర్ఫామిక్స్ అనే కంపెనీలో ఎండీ హోదా దక్కింది. ఇక ఇప్పుడు కాంగో గూగుల్ ఇండియాలో పనిచేస్తోంది. ఆ కంపెనీలో హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ రోల్లో కీలక బాధ్యతలు నిర్వర్విస్తోంది. గూగుల్ డిజిటల్ స్ట్రాటజీస్, ఇన్నోవేషన్స్ విభాగాన్ని పర్యవేక్షిస్తోన్న మయూరి కార్పొరేట్ రంగంలో దూకుడు చూపిస్తూ ఔరా అనిపిస్తుంది.