Mahesh Babu | టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పనేదో తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకుండా, హిట్స్ వచ్చినప్పుడు పొంగిపోకుండా చాలా రిజర్వ్డ్గా ఉంటారు మహేష్. అయితే మహేష్ బాబు ప్లానింగ్ అందరికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు రాజమౌళితో సినిమా అంటే ఏ హీరోకి అయిన సరదాగా టూర్స్ వెళ్లే ఛాన్స్ రాదు. కాని మహేష్ బాబు మాత్రం రీసెంట్గా ఫ్యామిలీతో షికారుకి వెళ్లాడు.
ఏమాత్రం తీరిక ఉన్నా కూడా ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లడం మహేష్ కి హ్యాబిట్ గా మారింది. రాజమౌళితో చేస్తున్న సినిమాకి కాస్త గ్యాప్ దొరకడంతో ప్రస్తుతం యూరోపియన్ దేశాలైన ఇటలీ, టస్కనీలో వెకేషన్ కి వెళ్లాడు. మహేష్ తో పాటు నమ్రత, సితార ఘట్టమనేని కూడా ఈ టూర్ లో ఉన్నారు. ఈ ట్రిప్ కి బయలుదేరే ముందు మహేష్ బాబు విమానాశ్రయంలో తన పాస్‌పోర్ట్‌ను కూడా చూపించాడు. ఇప్పుడు ఆన్ సైట్ నుంచి అద్భుతమైన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇస్తున్నాడు. మహేష్ బాబు ఫ్యామిలీ రోమ్ విజిట్ తర్వాత టస్కనీకి వెళ్లింది. అక్కడి నుంచి లైవ్ ఫోటోలు షేర్ చేస్తున్నారు.
ఈ వెకేషన్ కి వెళ్లే ముందు రాజమౌళి తో ఎస్.ఎస్.ఎం.బి 29 కి సంబంధించి రెండు ప్రధాన షెడ్యూళ్లను పూర్తి చేసాడు మహేష్. ఏప్రిల్ చివరి నుంచి మూడో షెడ్యూల్ ని ప్రారంభిస్తాడని సమాచారం. ఓ వైపు వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా కూడా, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. రాజమౌళితో సినిమా చేశాము అంటే బందీ అయినట్టే. గతంలో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వారు ఇంత సరదాగా బయట తిరిగింది లేదు. కాని మహేష్ బాబు మాత్రం ఓవైపు రాజమౌళితో సినిమా చేస్తూనే మధ్యలో ప్రకటనలు, ఇంకో వైపు ఫ్యామిలీతో టూర్స్ సాగిస్తున్నాడు. ఇది కేవలం మహేష్ బాబుకి మాత్రమే సాధ్యం అని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.