Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. ఆయన గ్లామర్‌కి ఎవరైన ఫిదా కావల్సిందే. కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ తనదైన నటనతో స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలోనే రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యంత భారీ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, ఈ మూవీతని ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రాజమౌళి అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.
అయితే రాజమౌళి సినిమాలో హీరో లుక్ గత సినిమాల కన్నా భిన్నంగా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుందనే చర్చ గత కొన్ని రోజులుగా నడుస్తుంది. ఈ క్రమంలో మహేష్ బాబు లేటెస్ట్ లుక్ లీక్ అయింది. ఇందులో హెయిర్, గడ్డం పొడవుగా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ లుక్ మాత్రం ఫ్యాన్స్ కి షాకింగ్ గా ఉంది. అసలు అక్కడ ఉన్నది మహేష్ బాబా, ఇంకెవరా అని ఒక్కసారి ఆలోచనలో పడ్డారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ . ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించే మహేష్ ఈ లుక్ లో బీస్ట్ లాగా ఉన్నాడని, గుర్తు పట్టకుండా మారాడని కొందరు కామెంట్ చేస్తున్నారు.
కొందరు ఫ్యాన్స్ అయితే మహేష్ లుక్ చూసి సింహాన్ని దగ్గర నుంచి చూస్తున్నట్లు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన కూడా మహేష్ లుక్ సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా వ్యాపించింది. ఇక సినిమా విషయానికి వస్తే చిత్రాన్ని రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆఫ్రికా అడవుల్లో మహేష్ తిరుగుతూ ప్రాణాంతక వ్యాధికి మెడిసిన్ తీసుకువచ్చే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు అర్ధం అవుతుంది. రామాయణంలో లక్ష్మణుడిని కాపాడేందుకు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తారు. ఆ పాయింట్ ఇన్సిపిరేషన్ తో విజయేంద్ర ప్రసాద్ ఈ కథ రాసినట్లు చెప్పుకొస్తున్నారు. ఒడిశాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ మరి కొద్ది రోజులలో జరుపుకోనుంది.