‘వారణాసి’ తర్వాత మహేష్‌బాబు చేయబోయే సినిమా ఏంటన్నది అభిమానులకు పెద్ద ప్రశ్నలా మారింది. ఇది మహేష్‌బాబు 30వ సినిమా కాబట్టి సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఆసక్తినెలకొంది. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు-సందీప్‌రెడ్డి వంగా కాంబో మూవీ మరోసారి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందని గత రెండేళ్లుగా వార్తలొస్తున్నాయి. ‘యానిమల్’ కంటే ముందే సందీప్‌రెడ్డి మహేష్‌బాబుతో సినిమా కోసం ప్రయత్నాలు చేశారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలేవీ నిజం కాలేదు. ఇద్దరూ భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయారు.
తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ఏషియన్ సినిమాస్ భారీ వ్యయంతో తెరకెక్కించనుందని ఫిల్మ్‌నగర్ టాక్. ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు చేయబోయే ప్రాజెక్ట్ ఇదేనని అభిమానులు కూడా సోషల్‌మీడియాలో నమ్మకంగా చెబుతున్నారు. అయితే ఇవన్నీ కేవలం ఉహాగానాలేనని, అధికారిక ప్రకటన వచ్చేవరకు నమ్మలేమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం మహేష్‌బాబు ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరోవైపు సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతే మహేశ్-సందీప్ కాంబోపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.