కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన చిత్రం శ్రీమంతుడు. ఈ మూవీ సమాజంపై చాలా ప్రభావం చూపించింది. తీసుకున్నది ఏదైన తిరిగి ఇచ్చేయాలి లేదంటే లావు అయిపోతాం అనే కాన్సెప్ట్‌తో కొరటాల శివ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ మూవీ విడుదల తర్వాత చాలా మంది చిత్రాన్ని స్పూర్తిగా తీసుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
తాజాగా శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో దోమకొండలోని బీబీపేట మండలంలో సుభాష్ రెడ్డి అనే నాయకుడు ఓ అందమైన పాఠశాలను కట్టించాడు. తన కొడుకు నేహాంత్ శ్రీమంతుడు సినిమా చూసి ఇలా కట్టించాలని అన్నాడట. దాంతో సుభాష్ రెడ్డి పాఠశాలతో పాటు జూనియక్ కాలేజ్ కూడా నిర్మిస్తున్నాడు. అయితే సుభాష్ రెడ్డి అంత కాకపోయినా తాను కూడా పక్కనే ఉన్న తన నానమ్మ ఊరు కోనాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలను బాగు చేయిస్తాను అని కేటీఆర్ మాటిచ్చాడు.
శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో ఈ పాఠశాల కట్టించారని ముందే తెలిస్తే.. మహేష్ బాబును తీసుకొచ్చే వాడిని అని సమావేశంలో కేటీఆర్ అన్నారు. అయితే ఇప్పుడు కట్టే జూనియర్ కాలేజ్ పూర్తయిన తరువాత మహేష్ బాబుని తీసుకొద్దాం అని కేటీఆర్ నిన్న జరిగిన మీటింగ్‌లో ఉన్నారు. అయితే శ్రీమంతుడు స్పూర్తితో పాఠశాల నిర్మించారని తెలుసుకున్న మహేష్ స్పందించారు. ఈ స్కూల్ నిర్మించడానికి కారణం శ్రీమంతుడు సినిమా అని తెలిసి ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. సుభాష్ రెడ్డి గారికి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు నిజమైన హీరో.. మీ లాంటి వాళ్లే మాకు కావాలి. ఈ గొప్ప ప్రాజెక్ట్ పూర్తయ్యాక శ్రీమంతుడు టీంతో కలిసి కచ్చితంగా మీ పాఠశాలకు వస్తామని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.
Will make sure to visit the college with my entire team of Srimanthudu once this noble project is complete. Respect always! 🙏🙏🙏@KTRTRS
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2021