SSMB 29 | దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), టాలీవుడ్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu) కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 29గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని రాజమౌళి అప్పట్లో వెల్లడించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు జక్కన్న. రీసెంట్గా ఈ చిత్రం శరవేగంగా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమా స్టార్ట్ కాకముందే సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఎస్ఎస్ఎంబీ 29 ముందు తాను నటించిన ఏ సినిమాను కూడా హిందీలో డబ్ చేయవద్దని మహేశ్ కోరినట్లు తెలుస్తుంది. హిందీ ప్రేక్షకులను రాజమౌళి సినిమాతోనే పలకరించాలని ప్రిన్స్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇందులో భాగంగానే తాను నటించిన పాత సినిమాలను డబ్ చేయవద్దని నిర్మాతలు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ఎస్ఎస్ఎంబీ 29 విషయానికి వస్తే.. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు వి.విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా.. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ.. వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌గా ఆర్.సి.కమల్ కణ్ణన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మోహన్ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్‌గా రమా రాజమౌళి పని చేయనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే నెలలో మూవీ కూడా లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇండోనేషియాకు చెందిన హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ఇందులో హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని సమాచారం.