Vicky Kaushal Chhaava | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ఛావా(Chhaava). రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతుంది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రూ.200 కోట్ల దిశగా దూసుకెళుతుంది. అయితే ఈ సినిమా కథ మొదట సూపర్ స్టార్ మహేశ్ బాబు దగ్గరికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ శంభాజీ పాత్ర కోసం మొదట మహేశ్ బాబు సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నచ్చని మహేశ్ రిజెక్ట్ చేశాడు. దీంతో చాలా రోజుల తర్వాత మళ్లీ ఇదే కథతో విక్కీ కౌశల్ దగ్గరికి వెళ్లగా విక్కీ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
అయితే మహేశ్‌కి ఇలా సూపర్ హిట్ అయిన సినిమాలు రిజెక్ట్ చేయడం కొత్తేమి కాదు. ఇంతకుముందు కూడా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజిని సినిమాను, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను రానా నటించిన లీడర్, రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్, ప్రభాస్ వర్షం, రవితేజ ఇడియట్, విజయ్ దళపతి నన్బన్, నాగ చైతన్య ఏ మాయ చేసావే, పూరీ జనగణమన (ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు) తదితర సినిమాలను మహేశ్ రిజెక్ట్ చేశాడు.