Mahesh Babu | మన టాలీవుడ్ హీరోలు మెల్లగా బాలీవుడ్లో జెండా పాతే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య ఎన్టీఆర్ వార్ 2 చిత్రంలో హృతిక్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ అయితే ఎన్టీఆర్ బాలీవుడ్లో బిజీ కానున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుకి టైం వచ్చింది. ధూమ్ 4లో సూపర్ స్టార్ నటించనున్నాడు అనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇది జరిగితే అద్భతమే. ధూమ్ 4 సంచలనంగా మారడం ఖాయం. ధూమ్ సిరీస్ లలో జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లు నటించగా, ఈ సినిమాలతో వారి రేంజ్ పెరిగింది. ధూమ్ ఫ్రాంచైజీకి కూడా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ధూమ్ 4 ఎప్పుడు మొదలవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు యాక్షన్ చిత్రాల సంచలనం అయాన్ ముఖర్జీ.. ధూమ్4కి రంగం సిద్ధం చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. హీరోగా రణబీర్ కపూర్‌ని తీసుకోవాలని అనుకుంటున్నాడట. మహేష్ బాబు పేరుని కూడా పరిశీలిస్తున్నాడట దర్శకుడు అయాన్. ధూమ్4లో మహేష్ బాబు నటిస్తే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్లో రూపొందుతుంది. ఈ సినిమాతో మహేష్ రేంజ్ ఎల్లలు దాటడం ఖాయం. ఈ సినిమా తర్వాత ధూమ్ 4 వస్తే బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించారు రాజమౌళి. అమెజాన్ అడవుల నేథ్యంలో అడ్వెంచరస్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో ప్రకటించారు. సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ప్రియాంకా షూటింగ్ లోనూ జాయిన్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కోసం ముగ్గురు దర్శకులు రెడీ అవుతున్నారని తెలుస్తుంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి బుచ్చిబాబు , సందీప్ రెడ్డి వంగ నాగ్ అశ్విన్ రెడీగా ఉన్నారని అంటున్నారు.