నటశేఖరుడిగా, సూపర్ స్టార్‌గా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుని.. అందరినీ విడిచి వెళ్లిపోయారు ఘట్టమనేని కృష్ణ. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సినిమాల ద్వారా చిరస్థాయిగా జీవించి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. తన నటవారసుడిగా మహేశ్‌బాబు (Mahesh Babu)ను అందరికీ పరిచయం చేసి.. తాను లేని లోటును మహేశ్ బాబులో చూసుకునేలా అభిమానులకు అవకాశం ఇచ్చారు కృష్ణ.
సినీ జనాల కోసం కృష్ణ మెమోరియల్ (Superstar Krishna Memorial) ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్త ఇపుడు అభిమానుల్లో జోష్ నింపుతోంది. త్వరలో ఘట్టమనేని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మెమోరియల్‌లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహంతోపాటు ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, ఇతర విశేషాలను ప్రతిబింబించేలా మహేశ్‌బాబు అండ్ ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో హీరోగా నటించడమే కాకుండా తెలుగు చలనచిత్రపరిశ్రమకు కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు కృష్ణ. నిర్మాతగా పద్మాలయ స్టూడియోస్ ద్వారా సక్సెస్ పుల్ చిత్రాలను నిర్మించారు.
సాధారణ నటుడి నుంచి సూపర్‌స్టార్‌గా సాగిన కృష్ణ జర్నీ విశేషాలు మెమోరియల్ ద్వారా అందరికీ అందుబాటులోకి రానున్నాయి. మెమోరియల్‌ను పద్మాలయ స్టూడియోస్‌లో ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : Suprerstar Krishna | కృష్ణ చివరి సినిమా ఇదే.. ఒకే హీరోయిన్‌తో 43 సినిమాలు..
Read Also : Super Star Krishna | తెలుగులో స్పై జోనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. సూపర్ స్టార్
Read Also : Love Today Trailer | మా ఇంట్లో నేనేం చెప్తే అది.. కానీ ఈ ఇంట్లో కొంచెం కష్టం.. లవ్ టుడే ట్రైలర్
Read Also : Ram Charan | రాంచరణ్ నయా జిమ్ చూశారా..? ఆర్సీ 15 కోసం వర్కవుట్స్ వీడియో
Read Also : Dhamki | ఫస్ట్ లుక్‌తోనే ధమ్కీ ఇస్తున్న విశ్వక్ సేన్.. ట్రెండింగ్‌లో పోస్టర్