యాక్టర్‌గానే కాదు..సామాజిక సేవతోనూ అందరి మనసుల్లో సుస్థిర సంపాదించుకున్నాడు టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu). ఈ స్టార్ హీరో ఇపుడు కొత్త వాహనానికి యజమాని అయ్యాడు. ఇంతకీ మహేశ్ బాబు కొనుగోలు చేసిన ఆ కొత్త కారేంటి..దాని ధర ఎంత అని తెగ ఆలోచిస్తున్నారా..?. ప్రిన్స్ కొన్నది ఆడి ఈ ట్రాన్ ఎలక్ట్రిక్ కారు (Audi e-tron). మహేశ్ బాబు స్వయంగా ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అందరికీ తెలియజేశాడు.
‘క్లీన్ అండ్ గ్రీన్, సుస్థిరమైన ఫ్యూచర్ హోం, ఆడి ఎక్స్ పీరియన్స్ పొందేందుకు ఎక్జయిటింగ్‌గా ఉంది..’ అంటూ ఫొటోకు మహేశ్ క్యాప్షన్ ఇచ్చాడు. మహేశ్ కొత్త ఎలక్ట్రిక్ కారు పక్కనే నిల్చుని దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లోహల్ చల్ చేస్తోంది. లోపల, బయట డైనమిక్ లుక్..భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్. ఆడి ఎక్స్ పీరియన్స్ ను పొందేందుకు మేమంతా మహేశ్ బాబుకు స్వాగతం పలుకుతున్నాం…’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ట్వీట్ చేశాడు.
e-tron ధర రూ.1.01 కోట్ల నుంచి రూ.1.19కోట్ల వరకు ఉండగా..మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ సౌకర్యంతో ఐదుగురు ప్రయాణించేలా ఉండే ఈ కారులో ఎల్ఈడీ హెడ్‌లైట్స్, 360 డిగ్రీల కెమెరాలు, కీ లెస్ ఎంట్రీ, రెండు వైపులా చార్జింగ్ పాయింట్స్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్‌తోపాటు మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి.
e-tron వేరియంట్ Audi e-tron GT ‘2022 వరల్డ్ కార్ అవార్డ్సు’లో (2022 World Car Awards) మూడు కేటగిరీల్లో నామినేట్ అయింది. ఫైనల్‌గా ‘వరల్డ్ పర్ఫార్మెన్స్ కారు’ అవార్డును గెలుచుకుంది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కొత్త కారు అవార్డు సెర్మనీకి ఆస్కార్స్ ఆఫ్ ది ఆటోమోబైల్ వరల్డ్‌గా నామకరణం చేశారు.