S.S Rajamouli | టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా అప్డేట్ల కోసం అటు బాబు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేశ్ కొత్త లుక్‌కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాజమౌళితో పాటు ఈ సినిమా కోసం మహేశ్ కూడా బాగా కష్టపడుతున్నారు. ఇప్పటికే జట్టు గడ్డం పెంచేసి లుక్స్ మొత్తం మార్చేసిన మహేశ్ తాజాగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నాడు. అయితే మహేశ్ జిమ్‌లో ఎక్సర్సైజ్ అనంతరం అద్దం ముందుకు వెళ్లి తన లుక్‌ని చూసుకుని బయటకు వెళ్లే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో జుట్టు మొత్తం వదిలేసి రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. ఇక వీడియో చూసిన అభిమానులు బాబు కొత్త లుక్ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథతో వస్తుండగా.. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది.
RAW & RUGGED LOOK ⌛🔥#SSMB29 #SSRMB pic.twitter.com/6GC8TTnsfQ
— Telugu Chitraalu (@TeluguChitraalu) February 27, 2025