Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. ఇప్పుడు రాజమౌళితో చేస్తుండగా, ఈ సినిమాతో మహేష్ బాబు క్రేజ్ ఎల్లలు దాటడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు మణిశర్మ. ఎంతో మంది హీరోలకి అద్భుతమైన బాణీలు అందించి సరికొత్త ట్రెండ్ కూడా సృష్టించారు. మహేష్ బాబు కెరీర్ మొదట్లో మంచి మ్యూజిక్ తో సూపర్ హిట్ సాంగ్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు మణిశర్మ. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ అని చెప్పాలి. ఇప్పటికీ ఆ పాటలు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి.
మురారి, ఒక్కడు, అతడు, అర్జున్, ఖలేజా, పోకిరి.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అన్ని పాటలు కూడా ఆల్టైమ్ హిట్సే. ఇది బాలేదు అని చెప్పే ప్రసక్తే లేదు. అయితే ఇంత బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో ఈ మధ్య సినిమాలు రావడం లేదు. ఖలేజా తర్వాత మళ్లీ మహేష్ బాబు సినిమాకి పని చేయలేదు మణిశర్మ. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు మాత్రం జస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఎక్కువ సినిమాలు చేసిన వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండే ఉంటుంది. కాని ఎందుకో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఓ సందర్భంలో ఇంటర్వ్యూలో లో పాల్గొన్న మణిశర్మ.. మహేష్ బాబుతో గ్యాప్ గురించి కామెంట్ చేస్తూ… ఏం జరిగిందో ఏమో తెలియదు. ఎందుకు దూరం పెట్టారో కూడా నాకు తెలియదు అని అన్నారు.
మా ఇద్దరి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. పొరపాటు ఏంటనేది నాకు తెలియదు. తప్పు నాది అయ ఉండడం వల్లనే అలా జరిగిందేమో. నేను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. వాళ్లెవరు కూడా నాకు ఏం జరిగిందో చెప్పలేదు. గ్యాప్ మాత్రం మా ఇద్దరి మధ్య అలా కంటిన్యూ అవుతుంది అని మణిశర్మ స్పష్టం చేశారు. మహేష్ బాబు మణిశర్మ కాంబో లో ఎన్నో సూపర్ హిట్స్ రాగా, తిరిగి ఆ కాంబో ప్రేక్షకులని అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.