Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకీ రెట్టింపవుతున్నాయి. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, సోషియో ఫాంటసీ వంటి విభిన్న జోనర్స్‌ను మేళవించి ఇప్పటివరకు ఇండియన్ సినిమా చూడని సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ వీడియో, మహేష్ బాబు ఫస్ట్ లుక్కు వచ్చిన అనూహ్య స్పందనతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఆసక్తిని రేకెత్తించింది. అప్పటి నుంచి ‘వారణాసి’కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ కీలక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ‘వారణాసి’ని రూపొందిస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు స్పష్టం చేశారు. ఇది కేవలం తెలుగు సినిమాకే కాదు, మొత్తం ఇండియన్ సినీ పరిశ్రమలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుంది. షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు పలు అల్యూమినియం ఫ్యాక్టరీలలో భారీ సెట్లు నిర్మించారు. అలాగే కోకాపేట ప్రాంతంలో భారీ ఖర్చుతో ప్రత్యేకంగా వారణాసి సెట్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఇదే సెట్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా కోకాపేట వారణాసి సెట్లో మహేష్ బాబు పాల్గొనే ఓ భారీ యాక్షన్ సీన్ షూటింగ్ జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఇది సినిమాలో హైలైట్‌గా నిలిచే హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ అని చెబుతున్నారు. అంతేకాదు, ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలోని ఓ ప్రత్యేక సెట్లో ఇంటర్వెల్ బ్లాక్‌ను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సన్నివేశాల్లో మహేష్ బాబు క్లీన్ షేవ్డ్ లుక్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు అంటే కేవలం ఫైట్లు మాత్రమే కాకుండా, ఎమోషన్, కథా బలం కలగలిపి ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించేలా డిజైన్ చేస్తారని తెలిసిందే. ‘వారణాసి’లో కూడా ఇలాంటి పవర్ఫుల్ యాక్షన్ బ్లాక్స్ ఎన్నో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబును రాజమౌళి ఇప్పటివరకు చూడని విధంగా ఇంటెన్స్ యాక్షన్ మోడ్‌లో ప్రజెంట్ చేయనున్నారని సమాచారం.ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అదే సమయంలో కథలో భాగంగా కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన రాముడి పాత్రలో దర్శనమిస్తారని కూడా స్పష్టత వచ్చింది. ఈ రెండు విభిన్న షేడ్స్‌లో మహేష్ బాబు నటన ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించనుందనే అంచనాలు ఉన్నాయి.