Mahesh Babu | రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందనే హోప్ తో ఉన్నారు. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ఏ హీరోకి కూడా కాస్త రిలాక్స్ టైం ఉండదు. అలాంటి మహేష్ బాబు ఎప్పటి మాదిరిగానే గ్యాప్‌లో తన ఫ్యామిలీతో టూర్‌కి వెళ్లాడు. భార్య నమ్రత శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేనితో కలిసి మహేష్ బాబు ఇటలీ వెళ్లారు. ఇటలీలో ఏ ఏరియాకి వెళ్లారో తెలుసా? టస్కనీకి. అక్కడ మహేష్ బాబు ఫుల్ రిలాక్స్ అవుతున్నాడు.
టస్కనీ ప్రాంతంలో హిస్టారికల్ ప్లేసులు ఎక్కువగా ఉన్నాయి. వాటిని విజిట్ చేస్తున్నారు. ఇటలీలో దిగిన ఫోటోలను నమ్రత తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే… ఆ ఫోటోల్లో మహేష్ లుక్ రివీల్ కాకుండా ఆవిడ జాగ్రత్త పడింది. సితార, నమత్ర మస్త్ చిల్ అవుతున్నారు. మరో వారం పాటు మహేష్ బాబు ఫ్యామిలీ అక్కడే ఉండి ఎంజాయ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఇండియాకి వచ్చాక మహేష్ బాబు నాన్ స్టాప్ షెడ్యూల్స్‌తో బిజీ కానున్నారు. కాగా, కుటుంబంతో కలిసి ఏడాదికి మినిమం మూడు ఫారెన్ ట్రిప్స్ మహేష్ బాబు వేస్తారని ఒక టాక్ ఉంది. ఇటలీ వెళ్లే మందు మహేష్ బాబు ఎయిర్ పోర్ట్ నుంచి తన పాస్ పోర్ట్ చూపించారు. దాంతో రాజమౌళి నుంచి మహేష్ తన పాస్ పోర్ట్ లాక్కున్నారని మీమ్స్ కూడా వచ్చాయి.
ఈ మూవీ మూడో షెడ్యూల్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2027 మార్చి 25న రిలీజ్ కాబోతోందనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. అయితే ఈ విషయంపై ఇంకా మేకర్స్ నుంచి అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ రాలేదు. అయితే మార్చి 25న గురువారం కాగా, ఎప్పటిలా రాజమౌళి తన సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ ఫ్రైడే కాకుండా మూవీని గురువారమే థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది.