సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి కొంత సమయాన్ని కచ్చితంగా కేటాయిస్తుంటాడు. విదేశాలలో సినిమా షూటింగ్స్ ఉంటే కంపల్సరీగా తన ఫ్యామిలీని తీసుకెళుతుంటారు. అక్కడ ఓ వైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు ఫ్యామిలీతో చక్కర్లు కొడుతూ ఉంటారు మహేష్. ప్రస్తుతం ఈ స్టార్ హీరో పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్ర షూటింగ్ చేస్తున్నాడు.
రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల కాగా, ఇది రికార్డులు క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి సినిమాగా చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అయితే చిత్ర బృందం ఇప్పుడు గోవా షెడ్యూల్ ప్లాన్ చేయగా, ఆయన తన ఫ్యామిలీని కూడా తీసుకొని అక్కడికి వెళ్లాడు. చార్టర్డ్ ఫ్లైట్‌లో వీరు గోవాకు వెళ్లినట్టు తెలుస్తుంది. మహేష్‌తో పాటు సితార, నమ్రత, గౌతమ్‌కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ ఈ షెడ్యూల్లో ఓ వైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు గోవా అందాలను ఆస్వాదించనున్నట్టు తెలుస్తుంది.
భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం.ఈ సినిమాను జీఎంబీ ప్రొడక్షన్స్, 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.