Mahesh Babu | మహేశ్ తన రెండో సినిమా ‘యువరాజు’లోని ఓ పాటలో కృష్ణుడిగా కనిపించి అభిమానుల్ని అలరించారు. ఆ తర్వాత మళ్లీ ఆయన పౌరాణిక గెటప్పులో కనిపించిన దాఖలాల్లేవు. అయితే.. త్వరలోనే శ్రీరాముడిగా మహేశ్ దర్శనమివ్వబోతున్నాడట. రాజమౌళి సినిమాలో మహేశ్ ఈ ఫీట్ చేయబోతున్నట్టు సోషల్‌మీడియాలో కథనాలు బలంగానే వినిపిస్తున్నాయి. వారణాసిలో పుట్టి అమెజాన్ అడవుల్లో కొనసాగే ఈ కథలో రామాయణకావ్యం కీలకంగా ఉంటుందట.
ఈ నేపథ్యంలోనే ఓ సన్నివేశంలో శ్రీరాముడిగా మహేశ్ కనిస్తాడని తెలుస్తున్నది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ైక్లెమాక్స్‌లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ని చూపించి ప్రేక్షకుల్ని రోమాంచితుల్ని చేశారు రాజమౌ ళి. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్తే నిజమై రామచంద్రమూర్తిగా మహేశ్ దర్శనమిస్తే.. ఆ ఇం పాక్ట్ ‘ఆర్ఆర్ఆర్’కి మించి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.