Guntur kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా ప్రాజెక్ట్ గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ ఫ్యాన్స్ కు కావాల్సిన వినోదాన్ని అందిస్తోంది. కెమెరామెన్ పీఎస్ వినోద్ కొన్ని సృజనాత్మక విభేదాల కారణంగా ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేయగా.. షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయినట్టు ఇప్పటికే ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు లండన్‌కు హాలీడే ట్రిప్ వేశారు.
తాజా అప్డేట్ ప్రకారం గుంటూరు కారం నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో రెండు భారీ సెట్స్ వేసినట్టు ఇన్సైడ్ టాక్. వీటిలో ఒక సెట్ మహేశ్ బాబు తాతయ్యకు సంబంధించిన పాత్ర కోసం డిజైన్ చేయగా.. రెండో సెట్ హైదరాబాద్‌లో హీరో తల్లి ఇల్లు అని టాక్. ఏఎస్ ప్రకాశ్ నేతృత్వంలో ఈ సెట్స్ నిర్మాణం కోసం భారీ మొత్తాన్ని వెచ్చించినట్టు సమాచారం. మీనాక్షి చౌదరి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. గుంటూరు కారం మాస్ స్ట్రైక్ అభిమానులను ఇంప్రెస్ చేస్తూ.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
గుంటూరు కారం 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మహేశ్ బాబు మరోవైపు త్వరలోనే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న ఎస్ఎస్ఎంబీ 29ను కూడా లాంఛ్ చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతుండగా.. దీనిపై అప్డేట్ రావాల్సి ఉంది.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..