Guntur kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతోంది. ఇటీవలే త్రివిక్రమ్ టీం లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ మహేశ్ బాబు అభిమానులకు కావాల్సిన ఫుల్ ట్రీట్ అందిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం గుంటూరు తర్వాతి షెడ్యూల్ జులై 7 నుంచి షురూ కానుంది. ఈ షెడ్యూల్లో హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్ ఏరియాలో హై ఆక్టేన్ సీక్వెన్స్ షురూ కానుంది. మహేశ్‌బాబుతోపాటు ఇతర నటీనటులు ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుంటూరు కారం మాస్ స్ట్రైక్ అభిమానులను ఇంప్రెస్ చేయడం, అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. మహేశ్ బాబు మరోవైపు త్వరలోనే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న ఎస్ఎస్ఎంబీ 29ను కూడా లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఇన్సైడ్ టాక్.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..