Sitara – Dua Lipa Concert | సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చిన్నతనంలోనే తండ్రికి తగ్గ తనయికగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అయితే ఈ భామ తాజాగా ఒక ఈవెంట్లో పాల్గోనగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
హాలీవుడ్ పాప్ సింగర్ దువా లిపా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కన్సర్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. శనివారం నిర్వహించిన ఆ కన్సర్ట్కు బాలీవుడ్ నుంచే కాకుండా టాలీవుడ్ నుంచి సెలబ్రీటీలు హాజరై సందడి చేశారు. ఇక మహేష్ బాబు గారాల పట్టి సితారతో పాటు అతడి భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఈ కన్సర్ట్కు హాజరైంది. బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్‌లో నమ్రతతో పాటు సితార కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరితో పాటు గ్రీన్కో ఎండీ అనిల్ చలమశెట్టి భార్య కూడా ఈ కన్సర్ట్‌లో చిందులు వేస్తూ కనిపించింది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Mahesh Babu’s daughter Sitara (a pop star in the making herself) and mom #NamrataShirodkar seen arriving at Dua Lipa’s concert in BKC.#maheshbabu #sitara #telugucinema #telugu #tamil #hindi #kannada #malayalam #tollywood #kollywood #bollywood #malluwood #sandalwood #telugucinema… pic.twitter.com/xSTxvUYSvL
— amaravatinews24 (@amaravatinews24) November 30, 2024