Mahesh Babu | టాలీవుడ్ (Tollywood) స్టార్ నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా రెండు చేతులా సంపాదిస్తున్నారు. మహేశ్‌కు విహార యాత్రల (Foreign Trips)కు వెళ్లడం అంటే ఇష్టమని మనకు తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఫారన్ ట్రిప్‌కు వెళ్తుంటారు. ఎక్కువగా పారిస్, జర్మనీ, స్విట్జర్లాండ్‌కు వెళ్లి వస్తుంటారు. తాజాగా దుబాయ్ ట్రిప్ (Dubai Trip)కు వెళ్లారు. అయితే, మహేశ్ దుబాయ్ ట్రిప్పై సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
మహేశ్‌బాబు సినిమాలే కాకుండా కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తుంటారు. వీటి ద్వారా వచ్చిన సంపాదనను వ్యాపార రంగంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పటికే ఏఎంబీ సినిమాస్‌లో భాగస్వామిగా ఉన్న మహేశ్ టెక్స్టైల్స్ బిజినెస్‌లోనూ రాణిస్తున్నారు. మొన్నీమధ్యనే హోటల్ బిజినెస్లోకీ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వ్యాపార రంగం, సినిమాల్లో వచ్చిన సొమ్ముతో పలు ప్రాంతాల్లో ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ముంబై, గోవా, బెంగళూరులో విలాసవంతమైన విల్లాలను మహేశ్ కొనుగోలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా దుబాయ్ (Dubai) లోనూ ఖరీదైన విల్లాను (Expensive Villa) కొనుగోలు చేసినట్లు పలు వెబ్సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి.
దుబాయ్‌లోని పాష్ ఏరియాలో అత్యంత విలాసవంతమైన విల్లాను మహేశ్ కుటుంబం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విల్లా ఖరీదు కోట్లల్లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ ఖరీదైన ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసమే మహేశ్ ప్రస్తుతం దుబాయ్ వెళ్లారని న్యూస్ సర్కిల్లో వార్త తెగ వైరల్ అవుతోంది. దీంతోపాటు రియల్ఎస్టేట్ రంగంలోనూ పెట్టుబడులు పెడుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయానికి సంబంధించి మహేశ్‌బాబు నుంచి అధికారికంగా ఎలాంటి స్పందనా లేదు. ప్రస్తుతం ఈ వార్త చిత్ర పరిశ్రమతోపాటు సోషల్ మీడియాలోనూ హాట్‌టాపిక్‌గా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల నాయికలు. ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. SSMB28 షూటింగ్ పనులు ఇప్పటికే హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
త్రివిక్రమ్ సినిమా పూర్తైన తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళితో SSMB 29 చేయనున్నారు.ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యూనివర్సల్ అడ్వెంచర్ కథాంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా బిజినెస్ కోసం ఇప్పటికే ఆయన హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణుల కూడా పనిచేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని సమాచారం.
Also Read..
Anand Mahindra | ఆ సినిమా తీయాలని రాజమౌళికి ఆనంద్ మహీంద్రా సూచన.. దర్శకధీరుడి రిప్లై ఇదీ
Jack Ma | టోక్యో కాలేజ్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేయనున్న జాక్‌మా