Mahesh Babu | ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) టైం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి టూర్ వేస్తాడని తెలిసిందే. సినిమా షూటింగ్‌కు గ్యాప్ వచ్చినా.. లేదంటే సినిమా విడుదలైన తర్వాత అయినా వెకేషన్‌కు వెళ్లొస్తుంటాడు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వేసిన మహేశ్ బాబు తిరిగి హోంటౌన్ హైదరాబాద్‌కు వచ్చేశాడన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఇవాళ ఉదయం ఎయిర్‌పోర్టులో మహేశ్ అండ్ ఫ్యామిలీ ప్రత్యక్షమైన విజువల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ట్రిప్ తర్వాత మహేశ్ బాబు రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమా షూట్లో జాయిన్ కాబోతున్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసు కదా.. ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) . తాజా టాక్ ప్రకారం ఒకటి లేదా రెండు రోజుల్లోనే జక్కన్న టీంతో జాయిన్ అవ్వబోతున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే నిజమైతే సూపర్ స్టార్ అభిమానులకు ఇక పండగే అని చెప్పొచ్చు.
ఎస్ఎస్ఎంబీ 29కి సంబంధించి జక్కన్న ఇప్పటికే మహేశ్ బాబుకు కొన్ని లుక్ టెస్టులు చేశారని వార్తలు వచ్చాయి. తాజాగా మహేశ్ బాబుకు మరికొన్ని లుక్ టెస్టులు చేయాలని భావిస్తుందట జక్కన్న టీం. ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతుండగా.. త్వరలోనే మరిన్ని వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ మూవీలో పాపులర్ హాలీవుడ్ యాక్టర్‌తోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్ యాక్టర్లు నటించబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఈ సినిమా కోసం జక్కన్న టీం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేసినట్టు ఇప్పటికే నెట్టింట అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి.
లాంగ్ హెయిర్‌తో మహేశ్‌బాబు..
Superstar @urstrulyMahesh & Little Princess Sitara Latest Picture 🤩❤️🔥#SSMB29 #GunturKaaram pic.twitter.com/LrLQCIzHIM
— Mahesh Babu News 🌶️😎 (@MaheshBabuNews) April 11, 2024
మౌంటెయిన్ డ్యూ కొత్త యాడ్..
Sensational and Stunning Superstar @urstrulyMahesh 😍 in latest Mountain Dew AD #MaheshBabu #SSMB29 pic.twitter.com/HPUs4azYq1
— GlobalTrending24 (@GlobalTrendng24) March 10, 2024
ఎస్ఎస్ఎంబీ 29 నయా అప్డేట్..
No Caption… Picture speaks a lot !!
ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.#SSMB29 🔥 pic.twitter.com/3BEV10srNS
— Rajesh Manne (@rajeshmanne1) January 23, 2024