Mahesh babu | సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతికొద్ది మంది స్టార్ హీరోల్లో మహేశ్ బాబు (Mahesh babu) ఒకరు. తనదైన టైమింగ్ డైలాగ్ డెలివరీతో ఇంప్రెస్ చేయడం మహేశ్ బాబు స్టైల్. ఈ స్టార్ హీరోకు ఫిదా అయిన సెలబ్రిటీల్లో తాజాగా టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) చేరిపోయాడు. ఈ టాలెంటెడ్ క్రికెటర్ ఇటీవలే గుంటూరు కారం చూశాడట. దీని గురించి మాట్లాడుతూ..
మహేశ్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం చాలా జాలీగా, వినోదాత్మకంగా ఉందని రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. చిట్ చాట్ సెషన్లో ఈ విషయమై రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. కుర్చీ మడతపెట్టి సాంగ్కు తమిళ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారన్నాడు. మహేశ్ బాబు ఎక్స్ట్రార్డినరీ డ్యాన్సర్ అని, శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ చేసిందన్నాడు. శ్రీలీల డ్యాన్స్ చూసి నేను విస్మయానికి గురయ్యానంటూ చెప్పడంతో సూపర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
గుంటూరు కారం ఈ ఏడాది జనవరి 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేశ్ బాబు కాంబోలో వచ్చిన ఈ ఊరమాస్ ఎంటర్టైన్మెంట్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. గుంటూరు కారం పాన్ ఇండియా ఓటీటీ డెబ్యూ కూడా ఇచ్చిందని తెలిసిందే. ప్రస్తుతం గుంటూరు కారం పాపులర్ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో వచ్చే కుర్చీమడతపెట్టి (Kurchi Madathapetti) సాంగ్కు నెట్టింట వేల సంఖ్యలో రీల్స్ చేశారని తెలిసిందే.
చీరకట్టులో, మోడ్రన్ డ్రెస్సులలో అమ్మాయిలు కుర్చీమడతపెట్టి సాంగ్కు ఇరగదీసే ఊరమాస్ స్టెప్పులేస్తూ దుమ్ముదులిపేసిన వీడియోలు ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
Ravichandran Ashwin about #GunturKaaram #MaheshBabu pic.twitter.com/jxPcpGupmL
— NEWS3PEOPLE (@news3people) March 19, 2024