విడుదల తేదీ ప్రకటించి షూటింగ్ చేయడం కత్తి మీద సాము లాంటిదే. పెట్టుకున్న టార్గెట్ అందుకునేలా టీమ్ అంతా శ్రమించాల్సి వస్తుంది. మహేష్ బాబు కొత్త సినిమా ఇదే మిషన్‌తో యుద్ధ ప్రాతిపదికన చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తున్నది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ తన 28వ చిత్రంలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల నాయికలుగా నటిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లో ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఆగస్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు నాన్ స్టాప్ షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నిర్మాణానంతర కార్యక్రమాలు సమాంతరంగా జరుపుతూ జూన్, జూలై కల్లా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి అనుకున్న తేదీకి తెరపైకి తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేసుకుంటున్నది. పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవుతామనే నమ్మకంలో మూవీ టీమ్ ఉన్నారట.