కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకు పరిమితం కాగా, వైద్యులు మాత్రం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రజలకు వైద్యం అందంచారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా కరోనా సమయంలో బాధితులకు తమ సేవలు అందించారు. ఈ క్రమంలో నాని చాలామంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు అంకితమిచ్చేందుకు ‘దారే లేదా’ సాంగ్‌ను రూపొందించారు.
రీసెంట్గా దారే లేదా అనే సాంగ్‌ని విడుదల చేయగా, దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ వీడియోకి ఫిదా అయ్యారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ని గౌరవించేందుకు మంచి దారి ఎన్నుకున్నారు. నిండు హృదయంతో చేసిన ఈ వీడియో చూసి నా మనసు కూడా సంతోషంతో నిండిపోయింది. నాని అండ్ అతని టీమ్ కు నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని మహేష్ వీడియో షేర్ చేశారు. దీనికి స్పందించిన నాని ..మీ మాటలతో ఈ సాంగ్ ఇంకెందరో హృదయాలను గెలుచుకుంటుంది. మాకు చాలా సంతోషంగా ఉంది అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
Thank you sir .. your words will take the song to many more hearts and we can’t ask for more .. means a lot 🙏🏼🤗
— Nani (@NameisNani) June 19, 2021