మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన చిత్రం ‘వసుదేవసుతం’ వైకుంఠ్ బోను దర్శకుడు. ధనలక్ష్మి బాదర్ల నిర్మాత. జూలై 10న సినిమా విడుదల కానున్నది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం ఈ సినిమా నుంచి పాట విడుదల చేశారు. ‘ఆనందాల వేళ..’ అంటూ సాగే ఈ పాటను ఆది సాయికుమార్ ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాటను, మణిశర్మ స్వరపరచగా, సాయిచరణ్ భాస్కరుని, శృతిక సముద్రాల ఆలపించారు. కుటుంబ ఆనందోత్సాహాల నేపథ్యంలో ఈ పాట సాగింది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఈ పాట చెబుతున్నది. జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: జిజ్జు సన్ని, నిర్మాణం: రెయిన్బో సినిమాస్.