Mahavatar Narsimha | మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో యానిమేటెడ్ చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన చిత్రం ‘మహావతార్ నరసింహ'(Mahavatar narsimha) కన్నడ టాప్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ నుంచి వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగులో మంచి కలెక్షన్లు సాధించడమే కాకుండా రూ.100 కోట్ల వసూళ్లను కూడా రాబట్టింది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై మేకర్స్ తాజాగా స్పందించారు.
మహావతార్ నరసింహ ఓటీటీలోకి వస్తుందని వస్తున్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. మా సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఇప్పటివరకు మేము ఏ ఓటీటీ ప్లాట్ఫామ్తోనూ ఒప్పందం కుదుర్చుకోలేదు. దయచేసి మా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వచ్చే అప్డేట్లను మాత్రమే నమ్మండి అని క్లీమ్ ప్రోడక్షన్స్ వెల్లడించింది. హోంబలే ఫిల్మ్స్‌తో కలిసి క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం జూలై 25న విడుదలైంది. హిందూ పురాణాల ఆధారంగా రూపొందించిన ఈ యానిమేటెడ్ చిత్రం విష్ణువు దశావతారాల గురించి ఏడు భాగాలుగా రూపొందించే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో మొదటిది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించాడు.