Mahavatar Narsimha | కన్నడ ఇండస్ట్రీ టాప్ బ్యానర్ హోంబాలే ఫిలింస్(Homable Films) మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది. ఇప్పటికే కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార, సలార్ వంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు తీసిన ఈ నిర్మాణ సంస్థ రీసెంట్గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మూడు ప్రాజెక్ట్‌లను ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి సలార్ 2 ప్రాజెక్ట్ కాగా.. ఇంకా రెండు ప్రాజెక్ట్‌లను త్వరలో వెల్లడించనుంది. అయితే ఈ బ్యానర్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది.
కాంతారతో సూపర్ హిట్ అందుకున్న హోంబాలే మరో మైథాలాజీ మూవీని తెరకెక్కిస్తుంది. ఇందులో భాగంగానే అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ‘మహావతార్ : నరసింహ’ అనే చిత్రాన్ని తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా.. ఉగ్ర నరసింహుని అవతారం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ మూవీలో నటించే నటీనటులకు సంబంధించి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు హోంబాలే ప్రకటించింది. శిల్పా ధావన్, కుశాల్ దేశారు, చైతన్య దేశారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కన్నడతో పాటు, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
When Faith is Challenged, He Appears.
In a World torn apart by Darkness and Chaos… Witness the Appearance of the Legend, The Half-Man, Half-Lion Avatar-Lord Vishnu’s Most Powerful Incarnation.Experience the Epic Battle between Good and Evil in 3D.… pic.twitter.com/DWP83g3IQa
— Mahavatar (@MahavatarTales) November 16, 2024