Mahavatar Narsimha | ఈ ఏడాది ఇండియన్ సినిమాలో సంచలనంగా నిలిచిన చిత్రం మహావతార్ నరసింహ . రిలీజ్‌కి ముందు ఈ సినిమాపై పెద్దగా ఎవరికీ నమ్మకం లేకపోయినా, దర్శకుడు అశ్విన్ కుమార్ తన ప్యాషన్‌తో, ఎన్నో కష్టాలతో సినిమాను పూర్తి చేశారు. తన ఆస్తులు తాకట్టు పెట్టి తీసిన ఈ సినిమా, కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొంది ఇప్పుడు రూ. 300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. జూలై 26న విడుదలైన ఈ చిత్రం నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు తర్వాత రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.
మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, తొలి రోజు రూ. 1.5 కోట్లు , రెండో రోజు రూ.2 కోట్లకు పైగా వసూలు చేసింది. నెమ్మదిగా మౌత్ టాక్‌తో రోజు రోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ 49 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 319 కోట్లు రాబట్టింది. అందులో ఇండియాలోనే రూ, 291 కోట్లు (నెట్ రూ.247 కోట్లు ), ఓవర్సీస్లో రూ. 28 కోట్లు వసూలు చేయడం విశేషం. స్టార్ హీరోలు లేకుండానే, ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండానే, కేవలం కంటెంట్ ఆధారంగా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. మైథాలజీ, ఫాంటసీ, సూపర్ హీరో ఎలిమెంట్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా మిళితం చేస్తే ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో మహావతార్ నరసింహ మరోసారి రుజువు చేసింది.
కాంతార, హనుమాన్ ,కొత్తలోక తర్వాత ఇప్పుడు మహావతార్ నరసింహ కూడా అదే రూట్లో విజయాన్ని అందుకుంది.ఈ సినిమా ఫిల్మ్ మేకర్స్‌కు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. స్టార్ కాస్ట్ కంటే కంటెంట్‌నే ప్రేక్షకులు ఎంచుకుంటారని, మౌత్ టాక్‌తోనే సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా మారవచ్చని, మంచి కథతో తీస్తే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుందని తెలియజెప్పింది. మొత్తం మీద, మహావతార్ నరసింహ ఈ ఏడాది ఇండియన్ సినిమాలో కొత్త బాట వేసిన సంచలన చిత్రంగా నిలిచింది. రానున్న రోజులలో ఈ మూవీని చాలా మంది ఆదర్శంగా తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.