క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి పాన్ ఇండియా నిర్మాణసంస్థ హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక వెంచర్ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'(MCU). శ్రీమహావిష్ణువు దశావతారాలకు చెందిన శ్రీమద్భాగవతం.. ఈ యానిమేటెడ్ ఫ్రాంచైజీ ద్వారా దృశ్యమానం కానున్నది. భారతీయ పురాణాల ఆధారంగా కూడిన కంటెంట్‌తో ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించని అత్యాధునిక యానిమేషన్ సినిమాటిక్ స్కేల్‌తో ఈ ఫ్రాంచైజీ అలరించనుంది. ఇందులో మొదటి భాగం ‘మహావతార్ నరసింహ’.
లోకకంఠకుడైన హిరణ్యకుశిపుడ్ని అంతమొందించేందుకు నరసింహుడిగా శ్రీమహావిష్ణువు అవతరించిన వృత్తాంతమే ఈ తొలి భాగం. అశ్వన్కుమార్ దర్శకుడు. శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాతలు. ఈ నెల 25న ఐదు ప్రధాన భారతీయ భాషల్లో 3డి ఫార్మాట్లో ఈ ఫ్రాంచైజీ విడుదల కానుంది. కళ్లు చెదిరే వీఎఫ్ఎక్స్, 3డి విజువల్స్, పవర్ఫుల్ బీజీఎంతో ‘మహావతార్ నరసింహ’ ప్రేక్షకుల్ని అలరించనున్నది.