Mahathalli| యూట్యూబ్‌ని ఎక్కువగా ఫాలో అయ్యే వారికి మహాతల్లి అంటే ఇట్టే తెలిసిపోతుంది. యూట్యూబ్‌లో సందడి చేసే జాహ్నవి దాసెట్టి అనే పేరు కంటే ‘మహాతల్లి’ అంటేనే ఇట్టే గుర్తుపడుతుంటారు. సోషల్ మీడియా గురించి కనీస అవగాహన ఉన్న ఎవ్వరికైనా ఈ మహతల్లి చాలా సుపరిచితురాలు. యంగ్ అమ్మాయిలు మహాతల్లిని బాగా ఫాలో అవుతుంటారు. అన్ని రకాల విషయాలను తన వీడియోల్లో ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈమె యూట్యూబ్ ఛానల్‌కు దాదాపు 20 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారంటే జాహ్నవి క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.
మహాతల్లి అలియాస్ జాహ్నవి దాసెట్టి తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లిగా ప్రమోషన్ పొందినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆదివారం (మార్చి 16) ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ద్వారా తనకు ఆడబిడ్డ పుట్టిన విషయాన్ని తెలియజేసింది. దీంతో జాహ్నవికి అభిమానులు, పలువురు సినీ ప్రముఖుల, నెటిన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సుశాంత్ రెడ్డి అనే వ్యక్తిని జాహ్నవి ప్రేమించి పెళ్లి చేసుకుంది.. గతేడాది గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఈ మహాతల్లి ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ జర్నీని ఫొటోలు, వీడియోల రూపంలో షేర్ చేస్తూనే ఉంది.
భర్తతో కలిసి ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంది. తాజాగా తమ వైవాహిక బంధానిక ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించడంతో ఫుల్ ఖుషీ అవుతుంది. జాహ్నవి సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ కాగా, ఆమె నిఫ్ట్‌లో ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు చదివింది. కానీ షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించింది. మొదట్లో షార్ట్ ఫిలిం డైరెక్టర్ హరీశ్ నాగరాజుతో కలిసి కొన్ని లఘు చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే మహాతల్లి- మహానుభావుడు అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్‌తోనే జనాలు ఆమెని మహాతల్లిగా గుర్తుంచుకున్నారు.ఇక ఆ తర్వాత మహా తల్లి పేరుతో తనే సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభి దాంతో ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది.