Chhaava Movie | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం ఛావా (Chhaava). ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్(Lakshman Utekar) దర్శకత్వం వహిస్తుండగా.. మడాక్ ఫిల్మ్స్ పతాకం పై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్(Chatrapathi Shivaji Maharaj) పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్(Shambaji MAharaaj) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతుండగా.. రష్మిక మందన్నా(Rashmika MAndanna) కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా.. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో శంభాజీ పాత్రలో ఉన్న విక్కీ కౌశల్ డ్యాన్స్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదంపై మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్(Uday Samanth) స్పందిస్తూ.. ఛావాలో ఛత్రపతి శంభాజీ మహరాజ్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఛత్రపతి డ్యాన్స్ ఎలా చేస్తాడు. దర్శకుడు ఈ భాగాన్ని కట్ చేయాలి. అలాగే ఈ సినిమాను చరిత్రకారులకి, స్కాలర్స్కి చూపించాలి.. వాళ్లు ఈ సినిమా చూసి ఒకవేళ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే సినిమాను విడుదల చేయనివ్వబోం అంటూ చెప్పుకోచ్చాడు.
అయితే ఈ వివాదం ముగియక ముందే తాజాగా ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. శంభాజీ మహరాజ్ జీవిత చరిత్రను సరిగ్గా చూపించాలి. మరాఠా ప్రజల కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన యోధుల చరిత్రను వక్రీకరించడం సరికాదని.. శంభాజీపై అందరికి అమితమైన ప్రేమ, గౌరవం ఉందని అది దెబ్బతినకుండా చూసుకోవాలి. క్రియేటివిటీతో పాటు సెన్సిటివిటీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటూ ఫడణవీస్ చెప్పుకోచ్చాడు.