ఉత్తమ నటనకు చిరునామా సావిత్రి
మహానటి సావిత్రి 90వ జయంతిని పురస్కరించుకుని సంజయ్ కిశోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్' ఇంగ్లీష్ పుస్తకాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
మహానటి సావిత్రి 90వ జయంతిని పురస్కరించుకుని సంజయ్ కిశోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీష్ పుస్తకాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. సీనియర్ నటి జయప్రద పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలిప్రతిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకి అందించారు. పుస్తక రచయిత సంజయ్ కిశోర్ మాట్లాడుతూ ‘ఈ సావిత్రి మరణించదు.. మరో సావిత్రి జన్మించదు అని ఆత్రేయ అన్నారు. అది ముమ్మాటికీ నిజం. తెలుగుసినీ చరిత్రలో ఏ కథానాయికకూ ఊరూరా విగ్రహాలు లేవు. అది సావిత్రి విషయంలోనే సాధ్యమైంది. చిరంజీవి తన సొంత ఖర్చుతో గ్రాండ్‌గా ఈవెంట్‌ని నిర్వహించి తెలుగు బుక్‌ని లాంచ్ చేశారు. ఈ ఇంగ్లిష్ అడిషన్ని జయప్రద లాంచ్ చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. ‘సావిత్రి పేరిట రాసిన బుక్‌ని ఆవిష్కరించడం నా పూర్వజన్మ సుకృతం.
ఉత్తమ నటనకు చిరునామా సావిత్రి. ఆమె ఓ అద్భుతం. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహానటులకు ధీటుగా నటించిన మేటి నటీమణి సావిత్రి’ అంటూ జయప్రద కొనియాడారు. తెలుగు అడిషన్‌కి మంచి స్పందన వచ్చిందని, ఈ బుక్‌ని ఇంగ్లిష్‌లో అనువదిస్తే మరింతమందికి చేరువవుతుందనే ఉద్దేశంతో ఈ ఇంగ్లిష్ అడిషన్ని తీసుకొచ్చామని సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి చెప్పారు. సావిత్రి ప్రాతఃస్మరణీయులు కారు..చిరస్మరణీయురాలని, అలాంటి వారికి మరణం ఉండదని బ్రహ్మానందం పేర్కొన్నారు. ఇంకా తమ్మారెడ్డి భరద్వాజ్, కేఐ వరప్రసాద్‌రెడ్డి, నిర్మాత నాగసుశీల, జయలలిత, బొల్లినేని కృష్ణయ్య కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

