Madhuri Dixit | ఓర్లాండోకు చెందిన బిలియనీర్, ఫార్మా రంగంలో అతిపెద్ద దిగ్గజంగా ఎదిగిన రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన–సూపర్ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు వంశీ గదిరాజు వివాహ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అంబానీ కుటుంబ వివాహాల తర్వాత భారతదేశంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్‌గా ఈ వేడుకలు నిలుస్తున్నాయి. ఉదయ్‌పూర్‌లో నవంబర్ 21 నుంచి 23 వరకు జరిగిన ఈ ఉత్సవాల్లో బాలీవుడ్–హాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. వివాహ వేడుకలో బాలీవుడ్ స్టార్లతో పాటు ఇంటర్నేషనల్ సెలబ్రిటీల హాజరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటి రోజు వేడుకలకు జూనియర్ డొనాల్డ్ ట్రంప్, అతని గర్ల్‌ఫ్రెండ్ కింబర్లీ గిల్‌ఫోయల్, అలాగే జెన్నిఫర్ లోపేజ్, జస్టిన్ బీబర్ వంటి హాలీవుడ్ తారలు పాల్గొన్నారు.
నవంబర్ 22న జరిగిన మెహందీ కార్యక్రమంలో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ప్రత్యేక ప్రదర్శన హోరెత్తించింది. ఆకుపచ్చ లెహంగా–పింక్ దుపట్టాతో అందంగా కనిపించిన మాధురీ, దేవదాస్ చిత్రంలోని ‘డోలా రే డోలా’ పాటకు ఐకానిక్ హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేయడంతో అక్కడి ప్రేక్షకులు ఉత్సాహంలో మునిగిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.ఈ వీడియోని చూసిన నెటిజన్స్.. మాధురీ ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు అని కామెంట్ చేస్తున్నారు. ఈ గ్రాండ్ వేడుకల్లో పాల్గొన్న బాలీవుడ్ తారలలో రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, కృతి సనన్, షాహిద్ కపూర్ వంటి ప్రముఖులు వేదికపై సందడి చేశారు.
మెహందీ నైట్‌ను దియా మీర్జా హోస్ట్ చేశారు. నోరా ఫతేహి హై ఎనర్జీ డ్యాన్స్‌తో ప్రాంగణం దద్దరిల్లింది. సంగీత్ నైట్‌కు కరణ్ జోహార్–సోఫీ చౌదరి యాంకరింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివాహానికి వచ్చిన అతిథులు డ్యాన్స్ ఫ్లోర్‌పై వేడుకను నిజమైన సెలబ్రేషన్‌గా మార్చేశారు. ఈ వివాహంలో పాల్గొన్న గెస్ట్ లిస్ట్ మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది. హాలీవుడ్ సెలబ్రిటీల నుండి బాలీవుడ్ టాప్ స్టార్స్ వరకు…
ఫార్మా, టెక్, బిజినెస్ రంగం దిగ్గజాలు వరకు… వందలాది ప్రముఖులు హాజరై గ్రాండ్ వెడ్డింగ్‌కు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశారు. మూడు రోజుల పాటు సాగిన ఈ బహుబిలియన్ డాలర్ వెడ్డింగ్ నవంబర్ 23తో ముగిసింది . పెళ్లి వేడుకలు, అతిథుల జాబితా, సెలబ్రిటీల ప్రదర్శనలు ఇవి అన్నీ కలిపి ఈ వివాహాన్ని 2024–25లో అత్యంత చర్చనీయాంశమైన ఈవెంట్‌గా నిలబెట్టాయి.