Madhu Priya | ప్రముఖ ఫోక్ సింగర్ మధు ప్రియ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ, ‘ఆడపిల్లనమ్మా’ పాటతో చిన్న వయస్సులోనే పాపులారిటీ సంపాదించింది. అప్పటినుంచి ఆమె ఫోక్ సంగీతంలో తనదైన ముద్ర వేసింది. 2011లో సినిమా రంగంలోకి అడుగు పెట్టిన మధుప్రియ, ‘దగ్గరగా దూరంగా’ చిత్రంలోని ‘పెద్దపులి’ పాటతో తెరంగేట్రం చేసింది. అనంతరం ఫిదా, భీష్మ, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, లైలా, సాక్ష్యం, టచ్ చేసి చూడు, నేల టికెట్ వంటి పలు హిట్ చిత్రాల్లో పాటలు పాడింది.
ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలోని ‘గోదారి గట్టుమీద’ పాటను మధుప్రియ పాడగా, ఇది శ్రోతలను ఎంతగా ఆకట్టుకున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే 18ఏళ్ల వయసులో మధుప్రియ శ్రీకాంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ వివాహం అనంతరం కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని, ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి జీవితం సాగిస్తోంది. ఇప్పుడు చెల్లి పెళ్లితో మళ్లీ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది.ఈ వేడుకతో మధుప్రియ కుటుంబం ఆనందోత్సాహంగా ఉందని తెలుస్తుంది. త్వరలోనే శ్రుతి ప్రియ-సుమంత్ పెళ్లి వేడుకకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇంట్లో ఈ శుభకార్యం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. మధుప్రియ సోదరి శ్రుతి ప్రియ, సుమంత్ పటేల్ అనే యువకుడితో త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మధుప్రియ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, చెల్లికి గ్రాండ్గా నిశ్చితార్థం జరిపించింది. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన చెల్లి శ్రుతి ప్రియ, మరిది సుమంత్ లను చూసి మురిసిపోయిన మధుప్రియ.. ఫైనల్లీ.. చెల్లి, మరిది.. మిమ్మల్ని ఇలా చూడడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ తన భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోలను చూసిన అభిమానులు, నెటిజన్లు జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.