‘దర్శకుడ్ని కావాలనేది నా కోరిక. ఈ విషయాన్ని ‘మన్మథుడు’ షూటింగ్ టైమ్‌లో నాగార్జున గారికి చెప్పాను. నీ మెంటాలిటీకి దర్శకుడు అంటే కష్టంకానీ, నిర్మాతగా ప్రయత్నించు అని నాగ్ సలహా ఇచ్చారు. నా కోరికను నిజం చేసుకుంటూ, నాగ్ సలహా పాటిస్తూ స్వీయ దర్శకత్వంలో ‘మాధవే మధుసూదన’ నిర్మించాను’ అని చెప్పారు దర్శక,నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు. తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే జంటగా నటించారు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్బంగా బొమ్మదేవర రామచంద్రరావు విలేకరులతో మాట్లాడారు. ‘సూపర్’ టైమ్‌లో అనుష్కకు మేకప్ వేస్తూ, ‘రేపు మీరు పెద్ద హీరోయిన్ అయ్యాక, నాకు డేట్స్ ఇవ్వాలని అడిగాను. ఇదే మాట చాలామంది హీరోయిన్లను అడిగాను. అయితే మాట నిలబెట్టుకున్న తార మాత్రం అనుష్క ఒక్కరే అని చెప్పారు.
అనుకున్న బడ్జెట్లో సినిమా తీశానని, ఏడాదిన్నర కేవలం స్క్రిప్ట్‌కి కేటాయించానని, కావాల్సిందే రాసుకున్నానని, రాసున్నదే తీశానని ఆయన అన్నారు. ‘ఓ మనిషికోసం ఎదురు చూస్తునాం. కానీ అతను రాలేదు. ఎదురు చూస్తున్న వ్యక్తి రాకపోతే ఆ బాధ వర్ణనీతం. అందులోంచి ఈ కథ పుట్టింది’ అని నిర్మాత అన్నారు.