వేదిక లీడ్‌రోల్ చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’. అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్ర పోషించారు. డా.హరిత గోగినేని ఈ చిత్రానికి దర్శకురాలు. డా.వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మాతలు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హీరో మాధవన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ని ఆయన అభినందించారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. మనసిక సమస్యలతో బాధపడుతున్న సింధుగా వేదిక ఇందులో కనిపించింది. ఎవరో తనను వెంటాడుతున్నట్టు భయపడుతుంటుంది. ఎవరు ధైర్యం చెప్పినా ఆమెను ఫియర్ వదలదు. చికిత్సకోసం సింధుని హాస్పిటల్లో చేర్చారు. అసలు సింధుని వెంటాడుతున్నది ఎవరు? ఆమె ఎందుకు భయపడుతున్నది? అనేది ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. ట్రైలర్ చివర్లో వేదిక ద్విపాత్రాభినయంలో కనిపించడం థ్రిల్‌కి గురిచేసింది. జెపి(జయప్రకాష్), పవిత్రలోకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్యకృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ.