మీరాభాయ్ ఛాను.. ఒకప్పుడు ఈ పేరు ఎవరికి పెద్దగా తెలిసేది కాదు. ఒలంపిక్స్‌లో 49 కిలోల విభాగంలో ఆమె రజత పతాకం సొంతం చేసుకున్న ఛాను భారత్‌కు తొలి పతాకాన్ని అందించింది. ఈ క్రమంలో ఆమకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆమె సాధించిన ఘనతకు ప్రశంసల వర్షంతో పాటు రివార్డ్స్ కూడా దక్కాయి
మిజోరాం ప్రభుత్వం ఆమెకు స్పోర్ట్స్ కోటాలో అడిషనల్ సూపరంటెండెంట్ అఫ్ పోలీస్‌గా పదవి కూడా ఇచ్చింది. రెండు కోట్ల రూపాయలు నగదు కూడా బహుమతిగా దక్కించుకుంది. అయితే తాజాగా మీరాభాయ్ .. నేలపై కూర్చొని భోజనం చేస్తున్న ఫోటో కూడా ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోని చూసిన నెటిజన్స్.. ఏ మాత్రం అహం లేకుండా సింపుల్‌గా ఉంటున్న మీరాభాయ్, చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫొటోపై తాజాగా నటుడు మాధవన్ స్పందించాడు. ‘అసలు ఇది నిజమేనా.. నేను నమ్మడం లేదు’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఉపాధి లేకపోయిన మహిళలు ధృడ సంకల్పంతో ముందుకు వెళ్లాలి అనే కోణంలో మాధవన్ స్పందించాడు అంటూ అయన అభిమానులు చెబుతున్నారు. కొందరేమో ఆయన కామెంట్ అంతరార్ధం ఏంటో తెలియడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Hey this cannot be true. I am at a complete loss of words. https://t.co/4H7IPK95J7
— Ranganathan Madhavan (@ActorMadhavan) July 29, 2021