అగ్రహీరో రవితేజ తమ్ముడు కుమారుడైన మాధవ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న రూరల్ రస్టిక్ మూవీ ‘మారెమ్మ’. మంచాల నాగరాజ్ దర్శకుడు. మయూర్‌రెడ్డి బంగారు నిర్మాత. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఇప్పుడు హీరో మాధవ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం స్పెషల్ పోస్టర్ని, గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇంటెన్స్, రగ్గడ్ లుక్‌లో ఉన్న మాధవ్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు.
కబడ్డీ కోర్ట్లోకి మాధవ్ అడుగుపెడుతున్నట్టుగా ప్రజెంట్ చేసిన గ్లింప్స్ మాస్‌ని ఆకట్టుకునేలా ఉంది. దీపా బాలు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్‌రెడ్డి, వి.ఎస్.రూపలక్ష్మి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి,
నిర్మాణం: మోక్ష ఆర్ట్స్.