విశాల్ కథానాయకుడిగా సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన చిత్రం‘మద గజ రాజా’. ఇటీవలే తమిళంలో విడుదలై ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. వరలక్ష్మి, అంజలి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని సత్యకృష్ణ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ నెల 31న తెలుగు రాష్ర్టాల్లో రిలీజ్ కానుంది. శనివారం ట్రైలర్‌ను అగ్ర నటుడు వెంకటేష్ విడుదల చేశారు.
యాక్షన్, కామెడీ హంగులతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా విశాల్, సంతానం మధ్య వచ్చే సన్నివేశాలు చక్కటి హాస్యాన్ని పండించాయి. యాక్షన్ ఘట్టాల్లో విశాల్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్ గ్లామర్‌తో మెప్పించారు. కామెడీ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు సుందర్ సి తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని, ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, నిర్మాణం: జెమినీ ఫిలిం సర్క్యూట్, తెలుగు రిలీజ్: సత్యకృష్ణన్ ప్రొడక్షన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్ సి.