Mad The Movie | యూత్‌ను మెప్పించే కంటెంట్‌తో వస్తే చాలు కలెక్షన్లు ఊహకందని స్థాయిలో ఉంటాయని ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. ముఖ్యంగా కాలేజ్ బ్యాక్గ్రాప్లో తెరకెక్కే సినిమాలకైతే యూత్‌లో ఓ రేంజ్లో హైప్ ఉంటుంది. సరైన కంటెంట్‌తో వస్తే మట్టుకు కోట్లు కొల్లగొట్టడం ఖాయం. హ్యాపిడేస్, కొత్త బంగారు లోకం, సై లాంటి సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే మళ్లీ ఈ మధ్య కాలంలో అలా కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఆహా ఓహో అనిపించే రేంజ్లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పుడా వెలతిని తీర్చేందుకు వస్తుంది మ్యాడ్ సినిమా. ఇటీవలే రిలీజైన టీజర్‌కు ఊహించని రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మేకర్స్ ఈసినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు.
ప్రౌడ్ సే సింగిల్ అంటూ సాగిన ఈ పాట యూత్‌కు నచ్చే విధంగా ఉంది. ఈ పాట ఫుల్ లిరికల్ వీడియోను సెప్టెంబర్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. భీమ్స్ సిసిరోలియో స్వర పరిచిన ఈ పాటను నాకాష్ అజిజ్ ఆలపించాడు. కాలేజ్గ్యాంగ్స్, సీనియర్లు, ర్యాగింగ్, ప్రేమలు, గొడవలు ఇలా ఓ రోలర్ కోస్టర్ రైడ్‌లా సినిమా ఉండబోతుందని టీజర్‌తో ఓ క్లారిటీ వచ్చేసింది. చాలా రోజుల తర్వాత ఓ సరికొత్త కాలేజ్ బ్యాక్గ్రాప్లో సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనా ఇలాంటి సినిమాలెన్నొచ్చినా యూత్‌లో ఇట్టే బజ్ వచ్చేస్తుంటుంది. కంటెంట్ కొత్తగా అనిపిస్తే.. వద్దన్నా ఆడియెన్స్ సూపర్ డూపర్ హిట్ చేసేస్తారు.
కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టీజర్లో భీమ్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఈ కథ మొత్తం ఒకే కాలేజ్ చుట్టూ జరుగుతుందని తెలుస్తుంది.