HomeCinemaMad Looks Exciting And Entertaining Dulquer Salmaan
Mad | ‘జాతిరత్నాలు’కు తగ్గదు
‘ట్రైలర్ చూశాను.. పేరుకు తగ్గట్టే ‘మ్యాడ్'గా ఫన్నీగా ఉంది. ఎవరూ కొత్తవాళ్లలా లేరు. అందరూ బాగా చేశారు. ఈ సినిమా విజయం పక్కా.’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు.
‘ట్రైలర్ చూశాను.. పేరుకు తగ్గట్టే ‘మ్యాడ్’గా ఫన్నీగా ఉంది. ఎవరూ కొత్తవాళ్లలా లేరు. అందరూ బాగా చేశారు. ఈ సినిమా విజయం పక్కా.’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు. సంగీత్శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీగౌరీప్రియ, అనంతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్‌శంకర్ దర్శకుడు. హారిక సూర్యదేవర నిర్మాత. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. దుల్కర్సల్మాన్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల అతిథులుగా హాజరయ్యారు. నవ్వించే విషయంలో ‘జాతిరత్నాలు’కు ఈ సినిమా ఏమాత్రం తగ్గదని సిద్ధు జొన్నలగడ్డ నమ్మకంగా చెప్పారు. ఇంకా శ్రీలీల, వెంకీ అట్లూరి, అనుదీప్‌లతో పాటు ప్రధానతారాగణం అంతా మాట్లాడారు.