నార్నే నవీన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీప్రియా, అనంతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకుడు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ని మంగళవారం హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీయార్ విడుదల చేశారు ఈనెల 6న సినిమా విడుదల కానున్న సందర్భంగా ఇందులోని ప్రధానపాత్రధారులంతా విలేకర్లతో ముచ్చటించారు. ‘హ్యాపీడేస్’లా ఉంటుందా? అనడిగితే ‘ ‘హ్యాపీడేస్’ వచ్చి పదిహేనేళ్లయింది.
అది అప్పటి జనరేషన్‌కి కనెక్టయిన సినిమా. ఇది ఇప్పటి జనరేషన్‌కి కనెక్టయ్యే సినిమా. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, ట్విటర్ ఎంజాయ్‌చేసే జనరేషన్ ఇది. అలాంటివారికి నచ్చే సినిమా ఇది. థియేటర్స్‌లో ఫుల్ లాఫ్ హంగామా అని చెప్పొచ్చు’ అని సంగీత్ శోభన్ చెప్పారు. ‘ ‘మ్యాడ్’ అంటే ఓ ప్రశంస. ఇది పిచ్చిగా నవ్వించే సినిమా కాబట్టే ‘మ్యాడ్’ అని పేరుపెట్టారు. ‘డీజే టిల్లు’ దర్శకుడు విమల్ కృష్ణ ఈ కథ విని ‘మ్యాడ్’ అని ప్రశంసించారు. ఆ ప్రశంస నచ్చే మా దర్శకుడు ‘కల్యాణ్‌శంకర్’ ఈ సినిమాకు ‘మ్యాడ్’ అనే టైటిల్ పెట్టారు‘ అని రామ్ నితిన్ చెప్పారు.