రాజీనామాలతో బెదిరించలేరు.. నాకు పనులున్నాయంటున్న మంచు విష్ణు..

Maa elections | మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ( Manchu vishnu ) శనివారం ప్రమాణ స్వీకారం చేశాడు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో విష్ణు, అతని ప్యానెల్ సభ్యులతో మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రమాణ స్వీకారం చేయించాడు. ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతం గురించి మాట్లాడే సమయం లేదని చెప్పాడు. ఎన్నికలు జరిగిన విధానం ఎలా ఉందనేది పక్కన పెడితే.. గెలిచాం కదా.. ఇక పని మొదలు పెడతామని చెప్పుకొచ్చాడు. అలాగే ప్రకాశ్ రాజ్ ( prakash raj ) ప్యానల్ చేసిన రాజీనామాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పాత విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుని అనవసరంగా సమయం వృథా చేయడం ఇష్టం లేదని అంటున్నాడు మంచు విష్ణు. ఇప్పటి నుంచి పనికొచ్చే విషయాలు ఉంటే తానే మీడియా ముందుకొస్తానని.. లేదంటే తన పని తాను చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే మా ఎన్నికల విషయంలో ప్రేక్షకులను చాలా ఎంటర్టైన్ చేశామని.. ఇకపై తమ పని తాము చేసుకుంటామని అన్నాడు. రాబోయే రెండు సంవత్సరాలలో మా అసోసియేషన్ రూపురేఖలను మార్చేస్తానని చెప్పాడు. మోహన్ బాబు కొడుకుగా.. మీ విష్ణుగా ఏం చేయాలో తనకు తెలుసని.. అవన్నీ చేసి చూపిస్తానని అంటున్నాడు.
ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ చేసిన రాజీనామాల గురించి కూడా ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యాడు మంచు విష్ణు. అందరూ కలిసి పని చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానని.. అయితే వారు రాజీనామాలు చేయడం ఊహించని పరిణామం అంటున్నాడు. గేమ్ అన్న తర్వాత విన్నర్ రన్నర్ ఉంటారని.. ఇక్కడ లూసర్ ఉండరనే విషయాన్ని వారు అర్థం చేసుకుంటే మంచిదని సూచించాడు. రాజీనామాలు చేసినంత మాత్రాన ఏదీ ఆగదని.. తమను ఎవరూ ఆపలేరని.. ఇకపై వాళ్ల ఇష్టం అన్నట్లు స్పందించాడు మంచు విష్ణు. మరోవైపు మా ఎన్నికలు జరిగిన తీరుపై ప్రకాశ్ రాజ్ కోర్టును ఆశ్రయిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఎన్నికలు అయిపోయి వారం రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆ వేడి తెలుస్తూనే ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Manchu Vishnu | ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం
Mohan babu | అన్నీ మరిచిపోయి బాలకృష్ణ ఓటేశారు: మోహన్‌బాబు
ముక్కలైపోతున్న మా అసోసియేషన్.. సో కాల్డ్ సినీ పెద్దలేం చేస్తున్నారో..?
Allu Arjun | ‘మా’ ఎన్నికలకు అల్లు అర్జున్ డుమ్మా..కారణమిదే..!
కాను కానంటూనే సినీ పెద్దవుతున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

