Maa Oori Polimera 3 | సత్యం రాజేష్ కథానాయకుడిగా డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన క్రేజీ థ్రిల్లర్ పొలిమేర -1 ఓటీటీ లో రిలీజై భారీ విజయాన్ని సాధించిన సంగతి అందరికి తెలిసిందే. దీని సీక్వెల్ పొలిమేర -2 థియేటర్లలో విడుదలై ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇది మర్డర్ మిస్టరీకి చేతబడి జోడించి చేసిన సినిమా. అయితే ఇప్పుడు ‘పొలిమేర -3’ కూడా రాబోతుందని తాజాగా ఈ చిత్రబృందం ప్రకటించింది.
డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ ఫ్రాంచైజీ సీక్వెల్లో సత్యం రాజేష్‌తో పాటు కామాక్షి భాస్కర్ల ముఖ్యతారలుగా నటిస్తున్నారు. పోలిమేర-2 చిత్రాన్ని పంపిణీ చేసిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానని ప్రకటన విడుదల చేశాడు. పోలిమేర ముందు భాగాల కంటే అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకుంటున్నారట. అంతేకాదు సత్యం రాజేష్‌తో మరో ప్రముఖ కమెడియన్ కూడా ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించే అవకాశాలున్నాయని తెలిపింది చిత్ర బృందం. అయితే ఈ చిత్రంలో చేతబడితో పాటు ప్రస్తుతం సమాజంలో వున్న మరో బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వంశీ నందిపాటి, ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌కు మంచి స్నేహితుడు కావడంతో ఈ చిత్రానికి గీతా ఆర్ట్స్ సంస్థ కూడా సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
#Polimera3 – Coming Soon. pic.twitter.com/hNIbCb2GfX
— Aakashavaani (@TheAakashavaani) July 10, 2024
Also Read..