సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో సునీల్ బులుసు నిర్మించారు. ఈ నెల 11న విడుదలకానుంది. శనివారం థియేట్రికల్ ట్రైలర్‌ను అగ్ర హీరో మహేష్‌బాబు విడుదల చేశారు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆద్యంతం హృద్యంగా సాగింది. చిన్నప్పుడే తనను వదిలేసిన తండ్రి మరలా జీవితంలోకి ప్రవేశిస్తే ఆ వ్యక్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ క్రమంలో వారి మధ్య జరిగే సంఘర్షణ ఏమిటనే అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది.
సుధీర్‌బాబు, సాయిచంద్, షాయాజీషిండే పాత్రలు హైలైట్‌గా నిలిచాయి. తండ్రీకొడుకుల ప్రేమానుబంధానికి దృశ్యరూపంగా ఈ సినిమా మనసుల్ని కదిలిస్తుందని దర్శకుడు తెలిపారు. ఆర్నా, రాజు సుందరం, శశాంక్, ఆమని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జై క్రిష్, దర్శకుడు: అభిలాష్ రెడ్డి కంకర.