Maa Inti Bangaaram | సమంత ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలుగులో దుమ్మురేపిన ఓపెనింగ్!
Maa Inti Bangaaram | సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో సాలిడ్ ఓపెనింగ్ సాధించింది.
Telugu Cinema | సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో సాలిడ్ ఓపెనింగ్ సాధించింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం తొలిరోజు భారతదేశంలో రూ.5.35 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తుంది. దీంతో ఇండియా గ్రాస్ కలెక్షన్ సుమారు రూ.8.20 కోట్లుగా నమోదుకాగా. దేశవ్యాప్తంగా 2,658 షోలలో ఈ సినిమా ప్రదర్శితమైంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ.6.50 కోట్ల గ్రాస్ రావడంతో తొలిరోజు వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్ రూ.13.25 కోట్లకు చేరింది.
రిజియన్ వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి రూ.4.75 కోట్ల గ్రాస్‌తో టాప్‌లో నిలిచాయి. కర్ణాటకలో రూ.90 లక్షలు, తమిళనాడులో రూ.38 లక్షల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. తెలుగు 2D వెర్షన్‌కు ఆక్యుపెన్సీ రోజంతా పెరుగుతూ వచ్చింది. ఉదయం షోలకు 26.15 శాతం ఉన్న ఆక్యుపెన్సీ, రాత్రి షోలకు 51.38 శాతానికి చేరింది. ప్రీమియం తెలుగు EPIQ ఫార్మాట్‌కు 96 శాతం ఓవరాల్ ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో దాదాపు హౌస్‌ఫుల్స్ పడగా, రాత్రి షోలకు 100 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది.
‘కుషి’ 2023 తర్వాత సమంత తెలుగు సినిమాలో లీడ్ రోల్లో నటించిన చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను నిజం చేస్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుష, శ్రీముఖి కీలక పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

