Satyam Rajesh Interview | సత్యం రాజేశ్ (Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ మా ఊరి పొలిమేర 2 (Ma Oori Polimera 2). డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో హార్రర్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సీక్వెల్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కానుంది. పల్లెటూరి నేపథ్యంలో చేతబడి (బ్లాక్ మ్యాజిక్) చుట్టూ తిరిగే డబుల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సీక్వెల్ ఉండబోతున్నట్టు టీజర్, ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ సౌజన్యంతో శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది సత్యం రాజేశ్ టీం. ఇందులో భాగంగా సత్యం రాజేశ్ మీడియాతో చిట్ చాట్ చేశాడు. పొలిమేర 2 విశేషాలు సత్యం రాజేశ్ మాటల్లోనే..
మీ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు.?
ఈ పాత్ర కోసం ప్రత్యేకించి ఏ సినిమాను కూడా రెఫరెన్స్‌గా తీసుకోలేదు. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ పాత్ర కోసంనన్ను గైడ్ చేసే సినిమాలేమి లేవు. సీక్వెల్లో నా పాత్ర మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతేకాదు కథ పరంగా ఈ సినిమాలో నగ్నత్వం అవసరం కూడా భావించా. ఓ సన్నివేశంలో నగ్నంగా నటించా. పొలిమేర 2 నా 20 ఏండ్ల కెరీర్లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుంది. సక్సెస్‌పై చాలా ధీమాగా ఉన్నా.
నిర్మాత గౌరీ కృష్ణ గురించి..
ఫస్ట్ పార్టుతో పోలిస్తే సీక్వెల్‌కు బడ్జెట్ ఎక్కువ. గౌరీ కృష్ణ అన్ని రకాలుగా చాలా సపోర్టుగా నిలిచారు. హై క్వాలిటీ సినిమాను తీసేలా మమ్మల్ని ప్రోత్సహించారు.
పొలిమేర 2 ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సెట్ అవదా.. దీనిపై మీ అభిప్రాయం..?
అవును.. హింస, ఒళ్లు గగుర్పొడిచే ఎలిమెంట్స్ వల్ల ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సెట్ అవదు. ఈ సినిమాను ప్రశంసించే ప్రత్యేకమైన ప్రేక్షకులున్నారు. ప్రీక్వెల్తో పోలిస్తే ఇందులో అడల్ట్ కంటెంట్ అంత పెద్దగా ఉండదు.
పొలిమేర 3 గురించి ఏమంటారు..?
పొలిమేర 3 కూడా వర్కింగ్ స్టేజీలో ఉంది. పొలిమేర 1కు ఇది ప్రీక్వెల్‌గా ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తా.
మీ ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతేంటి..?
ప్రస్తుతం బాలకృష్ణ సినిమాతోపాటు వరుణ్‌తేజ్ మట్కా, Tenant సినిమాలతో బిజీగా ఉన్నా. మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నా. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టుల వివరాల గురించి చెబుతా.
రిలీజ్ ట్రైలర్..
మా ఊరి పొలిమేర 2 ట్రైలర్..
మా ఊరి పొలిమేర 2 టీజర్..