Anantha Sriram | గీతరచయిత అనంతశ్రీరామ్ బెస్ట్ లిరిక్ రైటర్‌గా ఐఫా అవార్డును దక్కించుకున్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ముఖ్య తారలుగా సాయిరాజేశ్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ‘బేబీ’(2023) చిత్రం కోసం ఆనంతశ్రీరామ్ రాసిన ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు ఈ అవార్డు లభించింది. దీంతో ‘బేబీ’ సినిమాకు బెస్ట్ లిరిక్ రైటర్‌గా అన్ని మేజర్ సంస్థల అవార్డ్స్‌నూ అనంతశ్రీరామ్ అందుకున్నట్టయ్యిందని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా అనంతశ్రీరామ్‌ని అభినందిస్తూ ‘బేబీ’ టీమ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రేక్షకుల రివార్డులతోపాటు ప్రతిష్టాత్మక అవార్డులు కూడా ‘బేబీ’ని వరిస్తున్నాయంటే.. ఈ ఘనత ఈ ప్రేమకథను హృద్యంగా తెరకెక్కించిన దర్శకుడు సాయిరాజేష్కే దక్కుతుందని నిర్మాత కొనియాడారు. సాయిరాజేశ్ దర్శకత్వంలో ఈ సినిమా హిందీలోనూ రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.